LIVE
Thursday, October 29, 2026
LIVE
LIVE

Konda Surekha | కేటీఆర్‌పై వ్యాఖ్యలు వెనక్కి.. కొండా సురేఖ కీలక ప్రకటన

by Bajaswamy
4 views
Former minister Konda Surekha apologizes to BRS working president KTR

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. కొన్ని సందర్భంలో ప్రతిపక్ష నేతలను విమర్శించే తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశానని, అయితే అవి నిరాధారమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన మాటల వల్ల వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ, గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ కుటుంబ గౌరవానికి భంగం కలిగించాలనే ఆలోచన తనకు లేదని ఆమె వెల్లడించారు. గతంలో అక్కినేని సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారానికి సంబంధించి కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన పరిణామాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More