TGPSC Notification: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కొత్త అవకాశాన్ని ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూస్తున్న వారికి టీజీపీఎస్సీ కొత్త నియామక ప్రకటన జారీ చేసింది. వివిధ గణాంకాధికారి పోస్టుల్లో మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనుండటంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయస్సు, దరఖాస్తు ఫీజు వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలి.
ఏయే పోస్టులు ఉన్నాయి?
మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ల నియామకానికి కమిషన్ ప్రకటన జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
విద్యార్హతలు, వయోపరిమితి
స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సును 2026 జులై 1 ప్రాతిపదికగా లెక్కిస్తారు. ఈ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారు, 44 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో అదనపు మినహాయింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు ఎంత? జీతం, పరీక్ష వివరాలు
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు రూ.500గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు వేతన స్కేలు ఉంటుంది. రాత పరీక్షను జనవరిలో నిర్వహించే అవకాశం ఉందని కమిషన్ తెలిపింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టికెట్లు అధికారిక వెబ్ సైట్ (https://www.tgpsc.gov.in/) అందుబాటులో ఉంచనున్నారు.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
అభ్యర్థులు ఖాళీలు, జోన్ల వారీ వివరాలు, సిలబస్, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి సమాచారాన్ని టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలి. అధికారుల ఆదేశాల మేరకు చివరి రోజు వరకు వేచి ఉండకుండా గడువులోపే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
ముఖ్య గమనిక: దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అన్ని నిబంధనలను పరిశీలించండి. అర్హతలు సరిపోతేనే అప్లికేషన్ సమర్పించండి.
