Jubilee Hills Fire accident: నగరంలోని జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రోస్టేషన్‌కు ఆనుకుని ఉన్న మంగళగౌరి వస్త్ర దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అగ్నిప్రమాదం కారణంగా సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంటలు ఎలా చెలరేగాయన్న విషయంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. నష్టం అంచనా ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ:Jitesh Sharma | టాప్ ఆర్డర్ కుప్పకూలాలని కోరుకుంటా: జితేశ్ శర్మ








