జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)లో ఓటర్లకు ఇచ్చిన డబ్బు ఇప్పుడు వివాదంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు ఓటర్లకు విచ్చలవిడిగా నగదు పంచిపెట్టగా, ఇప్పుడు ఓటు వేయని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. స్థానిక నేతలు బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో తిరుగుతూ, డబ్బు తీసుకుని ఓటేయని వారిని నిలదీస్తున్నారు(Jubilee Hills by-election money recovery). ఏజెంట్ల లిస్టులతో పోల్చి చూసి, ఓటు వేయని వారిని గుర్తించి డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.
ఎస్పీఆర్ హిల్స్‌లో ఒక కుటుంబం 18 ఓట్లకు రూ.45 వేలు తీసుకోగా, కేవలం నలుగురే ఓటు వేశారని సమాచారం. మిగిలిన డబ్బు ఇవ్వాలని వారిపై ఒత్తిడి పెడుతున్నారు. మధురానగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.
ALSO READ:KCR High Court Order:కాళేశ్వరం అవకతవకల కేసులో కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం
కొన్నిచోట్ల బస్తీ పెద్దలే జోక్యం చేసుకుని ఆ డబ్బులను బస్తీ అవసరాలకు వాడాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మధురానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అయితే ఓటేయని వారి జాబితాను చూసి, తిరిగి వచ్చిన డబ్బును నిర్వహణ ఖర్చులకు వినియోగించాలని నిర్ణయించారు.
ఈ వింత పరిణామాలతో జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
