జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ పూర్తయిన తర్వాత, ఈవీఎంలను(EVM) కట్టుదిట్టమైన భద్రత మధ్య యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు(Jubilee Hills By-election EVM Security) తరలించారు. ఎన్నికల సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాల పర్యవేక్షణలో ఈవీఎంలను ప్రత్యేక బస్సుల ద్వారా భద్రంగా తీసుకువచ్చారు.
ప్రతి బస్సు కోసం ప్రత్యేక మార్గాలను కేటాయించి, పోలీసులు ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టారు. స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు, పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఎవరూ అనుమతి లేకుండా ప్రవేశించకుండా కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది.
also read:Bihar Elections Polling Record:70 ఏళ్ల తర్వాత రికార్డు ఓటింగ్
ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలపాటు భద్రతా సిబ్బందిని మోహరించారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీల్ చేశారు.
పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ప్రతి కదలికను పర్యవేక్షించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాబోయే ఓట్ల లెక్కింపు వరకు ఈవీఎంలను ఎటువంటి జోక్యం లేకుండా భద్రంగా ఉంచుతామని ఎన్నికల అధికారులు తెలిపారు.
