గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, ఆమె అత్తగారు సురేఖ కొణిదెల కలిసి ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరిట తెలుగు ఆహార ఉత్పత్తుల బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటికే ఫుడ్ లవర్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ అనే స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీ కపూర్‌కు అత్తమ్మాస్ కిచెన్ స్పెషల్ కిట్ బాక్స్ అందించడం విశేషం. ఈ బాక్స్‌ను ఉపాసన స్వయంగా జాన్వీకి అందించారు. ఈ విషయాన్ని అత్తమ్మాస్ కిచెన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ డెలివరీ రామ్ చరణ్, ఉపాసన, జాన్వీ కలిసి బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు.
అత్తమ్మాస్ కిచెన్ నుంచి ప్రత్యేకంగా తయారైన తెలుగు రుచులను ఆస్వాదించిన జాన్వీ, ఈ గిఫ్ట్ చూసి ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ‘RC 16’ సినిమా సెట్స్‌పై మరిన్ని సర్ప్రైజ్‌లు ఉంటాయని అత్తమ్మాస్ కిచెన్ టీమ్ తెలిపింది.
‘‘ఇంతకీ RC 16 సెట్స్‌పై ఇంకే వండబోతున్నారు?.. వేచి చూడండి!’’ అంటూ అత్తమ్మాస్ కిచెన్ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ సినిమా, ఉపాసన వ్యాపారం, జాన్వీ ఎంట్రీ—ఈ మూడూ కలిసి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
