సొంత గడ్డపై భారత్ భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. 549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది.
టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవగా, రవీంద్ర జడేజా (54) మాత్రమే ప్రతిఘటించాడు. సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత బ్యాటింగ్‌లైన్‌ప్‌ను చిత్తు చేశాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, యాన్సన్–ముత్తుస్వామి చెరో వికెట్ తీశారు.
నాలుగో రోజు 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్, చివరి రోజున 522 పరుగులు చేజ్ చేయాల్సిన పరిస్థితి. డ్రా కోసమైనా ప్రయత్నిస్తుందని నిరీక్షించిన అభిమానులు నిరాశ చెందారు.
ఇదే పిచ్‌పై దక్షిణాఫ్రికా భారీ రన్స్ చేసినప్పటికీ, భారత బ్యాటర్లు నిలబడలేక వరుసగా పెవిలియన్ చేరారు. జడేజా అర్థశతకం చేయకపోతే స్కోరు 100 లోపు ఆగిపోయే పరిస్థితి.
ఈ ఓటమితో టెస్ట్ సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. నవంబరులో న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపైనే ఎదుర్కొన్న వైట్‌వాష్ తర్వాత ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేయగా, భారత్ 201 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆఫ్రికా 260/5 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి మ్యాచ్‌ను ఆధీనంలో ఉంచుకుంది.
also read:గూగుల్ మీట్ సేవల్లో అంతరాయం – మీటింగ్‌లకు జాయిన్ కాలేక యూజర్ల ఇబ్బందులు
