Friday, March 6, 2026
No menu items!
Google search engine
HomeUncategorizedIND vs ENG Semi-Final History | 2022 ఓటమి, 2024 ప్రతీకారం.. 2026లో ఎవరి...

IND vs ENG Semi-Final History | 2022 ఓటమి, 2024 ప్రతీకారం.. 2026లో ఎవరి విజయం?

- Advertisement -
Google search engine

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియన్ టీం మరియు ఇంగ్లాండ్ టీం మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ముఖ్యంగా ICC Men’s T20 World Cup వంటి మెగా టోర్నీల నాకౌట్ దశలో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు అసలైన థ్రిల్ కలుగుతుంది.

ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో భారత్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకోగా, మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium) లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

గత సెమీఫైనల్ తిరగేస్తే, 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ భారత్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ ఓటమి భారత అభిమానులను నిరాశపరిచింది. అయితే 2024 సెమీఫైనల్‌లో భారత్ సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఇరు జట్ల మధ్య సెమీఫైనల్ రికార్డు 1-1గా సమమైంది.

ఇప్పుడు 2026 సెమీఫైనల్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గతంలో ఒక్కోసారి ఒక్కో జట్టు పైచేయి సాధించి సమఉజ్జీగానిలవడం తో  ఈసారి ఎవరు గెలుస్తారన్న ఆసక్తి మరింత నెలకొంది.

వాంఖడే మైదానం చిన్నదిగా ఉండటంతో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు జట్లు ఇప్పటికే ముంబై చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఈ పోరు అభిమానులకు మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌ను అందించనుంది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular