Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeBusinessGold Silver price today | ఒక్కరోజులో భారీ పతనం.. వెండి మార్కెట్‌లో సంచలనం

Gold Silver price today | ఒక్కరోజులో భారీ పతనం.. వెండి మార్కెట్‌లో సంచలనం

-

Chat on WhatsApp

Gold Silver price today: వినియోగదారులకు ఊరటనిచ్చేలా వెండి ధరలు భారీగా పడిపోయాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఒక్క రోజులోనే కేజీ వెండి ధర ఏకంగా రూ.15,000 తగ్గింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధర ఈరోజు ఒక్కసారిగా పతనం అవడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం కేజీ వెండి రూ.2,85,000 వద్ద కొనసాగుతోంది. వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి, పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశం అని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఇక బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రూ.430 పెరిగి రూ.1,61,780కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరిగి రూ.1,48,300 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ మారకం విలువ, గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.

ధరల్లో ఇలాంటి హెచ్చుతగ్గులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొనుగోలు ముందు తాజా ధరలను ఒకసారి సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.

ALSO READ:Telangana government | ఉద్యోగులకు తీపి కబురు…పెన్షనర్లకూ వర్తించే కొత్త పథకాలు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp