మళ్ళీ పుట్టుకొచ్చిన కొత్త పైరసీ తెలుగు సినిమాల పై క్లిక్ చేస్తే మూవీరూల్జ్‌కు రీడైరెక్ట్ అవుతున్న లింకులు. తాజాగా ‘iBomma One’ అనే కొత్త పైరసీ వెబ్‌సైట్ ఆన్లైన్‌లో ప్రత్యక్షమైంది. ఈ సైట్‌లో తాజా తెలుగు సినిమాలు కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే, యూజర్లు నేరుగా ‘MovieRulz’ సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు.
ALSO READ:Pista House IT Raids: హైదరాబాద్‌లో యజమాని ఇంటి నుంచి రూ.5 కోట్లు స్వాధీనం
iBomma నెట్‌వర్క్‌లో సుమారు “65 మిర్రర్ వెబ్‌సైట్లు” ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. వాటిలో ఒకదాన్ని ఇప్పుడు ‘iBomma One’ పేరుతో ప్రచారంలోకి తెచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామంతో పాటు, పైరసీకి ప్రధాన మార్గంగా మారుతున్న MovieRulz, TamilMV వంటి సైట్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న ఈ రీడైరెక్ట్ నెట్‌వర్క్‌పై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
