Honda SUV ZR-V: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రీమియం SUV సెగ్మెంట్‌కు మరింత పోటీని తీసుకువస్తూ హోండా కార్స్ ఇండియా తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUV ‘హోండా జడ్ఆర్-వీ హైబ్రిడ్’ను అధికారికంగా విడుదల చేసింది. జపాన్ నుంచి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) రూపంలో దిగుమతి చేసి ఈ మోడల్‌ను భారత మార్కెట్‌లో విక్రయించనున్నారు.
అత్యాధునిక హైబ్రిడ్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో ఈ SUV వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. స్టైలిష్ డిజైన్‌తో కూడిన స్లిక్ SUV సిల్హౌట్, ఫ్లోయింగ్ బాడీ లైన్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముందు భాగంలో గ్లాసీ బ్లాక్ వర్టికల్ స్లాట్ గ్రిల్, స్లిమ్ ఫుల్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
వెనుక భాగంలో ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫినిషర్, 18 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ స్పోర్టీ ఫీల్‌ను పెంచుతాయి. ఈ SUV 4,567 mm పొడవు, 1,840 mm వెడల్పు, 1,621 mm ఎత్తు, 2,655 mm వీల్‌బేస్‌తో విశాలమైన కేబిన్‌ను అందిస్తుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే హోండా పూర్తిగా ప్రీమియం అనుభూతిపై దృష్టి పెట్టింది. ఆల్-బ్లాక్ స్పోర్టీ థీమ్‌తో కూడిన క్యాబిన్‌లో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ ఉపయోగించారు. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ Android Auto, Apple CarPlay), 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. పానరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 12-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్లను మడిస్తే 1,313 లీటర్ల వరకు లగేజ్ స్పేస్ లభిస్తుంది.
ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో 2.0 లీటర్ e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించారు. 2.0 లీటర్ అట్కిన్‌సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్, డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్ కలిసి 184 bhp పవర్, 315 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. కంపెనీ ప్రకారం ఇది లీటరుకు 22.79 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ మోడ్‌ల మధ్య ఆటోమేటిక్‌గా మారే సామర్థ్యం దీని ప్రత్యేకత.
భద్రత విషయంలో హోండా సెన్సింగ్ (ADAS) సూట్‌ను అందించింది. ఇందులో కోలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 8 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా అందించారు.
ఈ SUV కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి. 3 సంవత్సరాల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీతో పాటు బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ వారంటీని హోండా అందిస్తోంది. ప్లాటినం వైట్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ సహా పలు రంగుల్లో ఈ SUV అందుబాటులో ఉంటుంది.








