Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshదేవిబెట్ట శ్రీ రంగస్వామి మహా రథోత్సవం వైభవంగా నిర్వహణ

దేవిబెట్ట శ్రీ రంగస్వామి మహా రథోత్సవం వైభవంగా నిర్వహణ

-

Chat on WhatsApp

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని దేవిబెట్ట గ్రామంలో శ్రీ శ్రీ రంగస్వామి మహా రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు వేద మంత్రాలతో హోమం నిర్వహించగా, గ్రామస్తుడు రెడ్డిమాను బలరాముడు భాజా భజంత్రీలతో మహా రథోత్సవాన్ని ముందుకు తీసుకు వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

అనంతరం శ్రీ శ్రీ రంగస్వామి ఆలయం నుండి ఆలయ అర్చకులు ఉత్సవమూర్తిని భక్తుల నడుమ రథం వద్దకు తీసుకెళ్లారు. నందికొళ్ళు, భజంత్రీలతో శోభాయమానంగా సాగిన రథోత్సవం భక్తులకు కనువిందు చేసింది. హోరోహర నినాదాలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొని తమ భక్తిభావాన్ని వ్యక్తపరిచారు.

మహా రథోత్సవం సందర్భంగా గ్రామంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో గ్రామీణ సీఐ మధుసూదన్ రావు, ఎస్‌ఐ శ్రీనివాసులు తమ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, శాంతియుతంగా ఉత్సవాన్ని కొనసాగించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్రామి రెడ్డి, టీడీపీ మండల నాయకులు దేవిబెట్ట సోమేశ్వర్ రెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్సవం విజయం సాధించేందుకు గ్రామస్తుల సహకారం ముఖ్యంగా నిలిచింది. భక్తిభావంతో నిర్వహించిన మహా రథోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp