Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeOthersపసిడికి అద్భుతమైన రోజులు! ధరల పెరుగుదల

పసిడికి అద్భుతమైన రోజులు! ధరల పెరుగుదల

-

Chat on WhatsApp

ప్రపంచ మార్కెట్లలో ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో, ఏప్రిల్ 21న, స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా 1.7% పెరిగి ఔన్స్‌కి $3,383.87 స్థాయికి చేరుకుంది. ఇది పశ్చిమ మార్కెట్లకు, ముఖ్యంగా అమెరికా మార్కెట్లకు విశేషమైన ప్రభావం చూపుతోంది. గత సెషన్‌లో $3,384 స్థాయిని తాకిన ఈ ధరలతో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లను సంతోషం పుట్టిస్తోంది, కానీ కొనుగోలు చేయాలనుకున్న వారికి మాత్రం ఈ ధరలు షాక్ అవుతాయి.

భారతదేశంలో కూడా ఈ బంగారం ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడే రూ.9,8350కి చేరుకుంది. భారత మార్కెట్లో ధరలు పెరగడం, పసిడి కొనాలనుకున్న వారికి కొంత కంఫ్యూజన్ కలిగిస్తోంది. పలు విశ్లేషకులు ఈ ధరలు ఇంకా పెరగాలని సూచిస్తున్నారు. కొంతమంది నిపుణులు ఈ వారంలో బంగారం ధర లక్ష రూపాయలు తాకవచ్చని అంచనా వేస్తున్నారు.

పసిడి ధరల పెరుగుదల వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటగా, అమెరికా డాలర్ బలహీనపడడం ఈ ధరల పెరుగుదలకు దారితీసింది. అదేవిధంగా, డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయం, ఫెడరల్ రిజర్వ్‌తో ఉన్న వివాదం కూడా దీనికి కారణాలు. ట్రంప్, చైనాపై 145% సుంకాలను విధించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 10 శాతం సుంకాలను అమలు చేశారు. దీని పై చైనా కూడా తమవైపు భారీగా స్పందించి, 125% సుంకాలను విధించింది. ఈ వాణిజ్య యుద్ధం పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపింది.

ఈ అంశాలపై ఇటీవల చైనా, అమెరికాతో చర్చలు జరుపుతున్నట్టు ప్రకటించిన ట్రంప్, వాణిజ్య యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని తెలిపారు. అయితే, ఈ చర్చల ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయో, తదుపరి తీసుకునే చర్యలు ఏమిటి అన్నది ఇంకా అనిశ్చితంగా ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

విలువల రాజకీయాలకు చిరునామా జైపాల్ రెడ్డి.. మంత్రుల ఘన నివాళులు

మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ రాజకీయవేత్త జైపాల్ రెడ్డి సేవలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి( Komatireddy Venkat Reddy), శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. ఆయన 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ‘స్ఫూర్తి స్థల్’...
- Advertisement -
Chat on WhatsApp