Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeBusinessToday Gold and Silver | బంగారం కొనాలనుకుంటున్నారా?.. నేడు గోల్డ్, సిల్వర్ ధరలు తెలుసుకోండి

Today Gold and Silver | బంగారం కొనాలనుకుంటున్నారా?.. నేడు గోల్డ్, సిల్వర్ ధరలు తెలుసుకోండి

-

Chat on WhatsApp

Today Gold and Silver: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి బంగారం, వెండి ధరలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా ఊగిసలాటలో ఉన్న గోల్డ్ రేట్లు తాజాగా మళ్లీ స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం, భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల ధోరణిలో మార్పులు కూడా బంగారం ధరల కదలికలకు ప్రధాన కారణాలుగా మారాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో నేటి (ఏప్రిల్ 3) బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం రూ.1,48,960, 22 క్యారెట్ బంగారం రూ.1,36,540, 18 క్యారెట్ బంగారం రూ.1,11,720గా నమోదయ్యాయి.

గురువారంతో పోలిస్తే మూడు రకాల బంగారంపైనా రూ.10 చొప్పున తగ్గుదల కనిపించింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలోకు రూ.2,54,900, 10 గ్రాములకు రూ.2,549గా ఉంది.

ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరులో రూ.1,48,960, ఢిల్లీలో రూ.1,49,110, చెన్నైలో రూ.1,49,990, సూరత్‌లో రూ.1,49,010గా ఉన్నాయి.

బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్ కదలికలు, యుద్ధ పరిణామాలపై ఆధారపడి రోజువారీగా మారే అవకాశం ఉన్నందున కొనుగోలు ముందు తాజా రేట్లు మరోసారి చెక్ చేసుకోవడం మంచిది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp