Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshNishesh Basavareddy | ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. ప్రవాసాంధ్రుడు నిషేష్ అదిరే విజయం

Nishesh Basavareddy | ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. ప్రవాసాంధ్రుడు నిషేష్ అదిరే విజయం

-

Chat on WhatsApp

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారతీయ మూలాలున్న యువ ఆటగాడు నిశేష్ బసవరెడ్డి(Nishesh Basavareddy) సంచలన విజయం సాధించాడు. పారిస్ వేదికగా జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.

అమెరికా(America) తరఫున బరిలోకి దిగిన 21 ఏళ్ల నిశేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ టోర్నీలో పాల్గొన్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అతను 7-6 (5), 7-6 (5), 6-7 (9), 6-1 తేడాతో ఫ్రిట్జ్‌పై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

నిశేష్ బసవరెడ్డి 2005 మే 5న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం న్యూపోర్ట్ బీచ్‌లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు సాయి ప్రసన్న, మురళీకృష్ణలు కాగా వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. 1999లో వారు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

చిన్న వయసులోనే టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకున్న నిశేష్‌కు అతని తండ్రి మొదట శిక్షణ ఇచ్చారు. తరువాత కోచ్ బ్రయాన్ స్మిత్ వద్ద ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందాడు. మాజీ డబుల్స్ వరల్డ్ నంబర్ 1 రాజీవ్ రామ్ మార్గదర్శకత్వం కూడా అతనికి లభించింది.

2022లో యూఎస్ ఓపెన్ జూనియర్ విభాగంలో ఓజాన్ బారిస్‌తో కలిసి బాయ్స్ డబుల్స్ టైటిల్ గెలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అనంతరం జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-3 స్థానానికి చేరుకున్నాడు. 2024లో ఏటీపీ ఛాలెంజర్ టూర్‌లో రెండు టైటిళ్లు గెలిచి తన ప్రతిభను చాటాడు.

2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేసిన నిశేష్, తొలి మ్యాచ్‌లోనే నోవాక్ జకోవిచ్‌పై తొలి సెట్ గెలిచి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్ సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించడం ద్వారా మరోసారి టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp