కొత్త ఏడాదిలో తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణమైనప్పటికీ భూమిపై పాక్షికంగానే కనిపిస్తుందని తెలిపారు. ఈ గ్రహణం భారతదేశంలో కనబడదని, కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ గ్రహణాన్ని నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే గ్రీన్‌లాండ్, ఐలాండ్‌లోని ప్రజలు పాక్షికంగా చూడవచ్చని తెలిపారు. భారతదేశంలో కనిపించని ఈ గ్రహణం సంబంధిత ప్రాంతాల్లో ఖచ్చితమైన సమయాల్లో ప్రదర్శితమవుతుంది.
వెస్ట్రన్ యూరప్‌లో మధ్యాహ్నం, నార్త్ వెస్ట్రన్ ఆఫ్రికాలో ఉదయం, ఈస్ట్రన్ యూరప్‌లో సాయంత్రం వేళ గ్రహణం కనబడుతుందని నాసా వెల్లడించింది. చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్య ప్రయాణించేప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుందని తెలిపారు.
భూమి నుంచి చూస్తే సూర్యుడు పాక్షికంగా అస్పష్టంగా మారుతాడు. ఇది ఖగోళ ప్రేమికులకు ఒక అరుదైన అవకాశం అని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారతీయులు ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేనప్పటికీ, అంతర్జాల ప్రసారాల ద్వారా వీక్షించే అవకాశం ఉంది.