Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshDevansh Dino Deets | డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన దేవాన్ష్.. ‘డైనో డీట్స్’ యూట్యూబ్ పాడ్‌కాస్ట్...

Devansh Dino Deets | డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన దేవాన్ష్.. ‘డైనో డీట్స్’ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ వైరల్

-

Chat on WhatsApp

Devansh Dino Deets: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ డిజిటల్ ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘డైనో డీట్స్’ పేరుతో అతడు ప్రారంభించిన కొత్త యూట్యూబ్ పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్ శుక్రవారం విడుదలైంది. కేవలం 10 ఏళ్ల వయసులోనే దేవాన్ష్ ఆత్మవిశ్వాసంతో, స్పష్టమైన ఇంగ్లిష్‌లో డైనోసార్ల ప్రపంచాన్ని పరిచయం చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ పాడ్‌కాస్ట్ ద్వారా దేవాన్ష్ మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న మెసోజోయిక్ యుగం విశేషాలు, పురాతన శిలాజాల్లో దాగి ఉన్న ఆసక్తికర అంశాలను వివరించనున్నాడు. ముఖ్యంగా భారతదేశ భూభాగంలో సంచరించిన డైనోసార్ల గురించి ప్రత్యేక సమాచారం అందించనున్నట్లు తెలుస్తోంది.

దేవాన్ష్ తొలి ఎపిసోడ్‌లో ప్రొఫెషనల్ హోస్ట్‌లా స్టూడియో సెటప్‌లో కూర్చొని డైనోసార్లపై ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. జురాసిక్ వరల్డ్ సినిమాల్లో చూపిన టైమ్‌లైన్ పూర్తిగా సరైనది కాదని, డైనోసార్లు సుమారు 145 నుంచి 66 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించాయని వివరించాడు.

అలాగే డైనోసార్లు 150 మిలియన్ల సంవత్సరాలకు పైగా భూమిపై జీవించాయని, వాటిలో కొన్ని పక్షి పరిమాణంలో చిన్నగా ఉండగా మరికొన్ని భారీ చెట్లంత పరిమాణంలో ఉండేవని చెప్పాడు. ఇప్పటివరకు సుమారు 800 రకాల డైనోసార్లను శాస్త్రవేత్తలు గుర్తించినట్లు కూడా వివరించాడు.

భారతదేశంలో కూడా రాజాసారస్ అనే డైనోసార్ ఉండేదని దేవాన్ష్ తన వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చిన్న వయసులోనే అతడి ప్రెజెంటేషన్ స్కిల్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp