Datura Plant Food Poisoning: సోషల్ మీడియా ప్రభావం మరోసారి ప్రమాదకరంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి వంటకం ప్రయత్నించిన ఒక కుటుంబానికి విషాదం ఎదురైంది. ఉమ్మెత్త పువ్వుతో చేసిన కూర తిని నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇక వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలోని గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన వారు ఉమ్మెత్త పువ్వును పప్పులో వేసుకుని వండుకుని తినడంతో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ వీడియోను ఆధారంగా తీసుకుని ఈ కుటుంబం ఉమ్మెత్త పువ్వు పప్పు వండినట్లు సమాచారం. తినిన కొద్దిసేపటికే వీరలక్ష్మి, గంగాభవాని, జయలక్ష్మి, వీరబ్బులు అస్వస్థతకు గురయ్యారు.
స్థానికులు వెంటనే వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం ఉమ్మెత్త పువ్వులో విషపూరిత పదార్థాలు ఉండటంతో దీనికి స్పష్టమైన విరుగుడు ఉండదని చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం బాధితుల పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్లు తెలిపినట్లు వారి బంధువులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Datura Plant Food Poisoning | ఇన్‌స్టా రీల్ చిట్కాలు…అది చూసి తిన్నవారికి తంటాలు
-








