Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeFilms Newsమంచు ఫ్యామిలీ వివాదంలో కోర్టు కీలక నిర్ణయం

మంచు ఫ్యామిలీ వివాదంలో కోర్టు కీలక నిర్ణయం

-

Chat on WhatsApp

మంచు ఫ్యామిలీ వివాదంలో సిటీ సివిల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మంచు మనోజ్ కు హైదరాబాదులోని కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. మంచు విష్ణు పై యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. వారి మధ్య విభేదాలు విష్ణు పరువుకు హాని కలిగించాయని న్యాయవాదులు వాదించారు.

విష్ణు తరఫు న్యాయవాదులు కోర్టుకు అందించిన సాక్ష్యాలు పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వివాదంలో మనోజ్ చర్యలు విష్ణుకు బాధ కలిగించాయని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల, ఈ వివాదం నడుస్తున్నప్పుడు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని సూచించింది.

ఇక, మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో తాను అరెస్టు కాకుండా ఉండేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కానీ, హైకోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. హైదరాబాద్‌లోనే ఉన్నట్లు అఫిడవిట్‌లో చెప్పాలని సూచించింది.

తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు, ఆపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మంచు ఫ్యామిలీలో జరిగిన ఈ వివాదం మీడియా మరియు న్యాయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదురుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp