
జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీనివాస్, పూసపాటి అదితి
విజయనగరంలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కిడ్నాప్, దాడి కేసులో అరెస్టై విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశిని కలిసిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించే విధంగా ఉన్నాయని, ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనడం…