గొల్లలపేట గ్రామంలో పేద యాదవుని ఇల్లు కూల్చడం దురదృష్టకరం
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లలపేట గ్రామంలో, పేద యాదవుడు పీతల చంటిబాబు గత పది సంవత్సరాలుగా నివసిస్తున్న ఇల్లు అకస్మాత్తుగా కూల్చబడింది. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దేవర ఈశ్వరరావు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఇల్లును పరిశీలించి, ఈ చర్యకు ముందస్తు నోటీసు లేకుండా, పేదవాడి ఇల్లు కూల్చడం అన్యాయమని అన్నారు. ఈ సందర్భంగా దేవర ఈశ్వరరావు మాట్లాడుతూ, ఇల్లు కూల్చడం సరికాదని, న్యాయం జరగాలని,…
