Villagers in Burja Mandal caught a vehicle smuggling teak trees from government land, demanding strict action against the culprits and YSRCP leaders.

బూర్జ మండలంలో టేకు చెట్ల అక్రమ రవాణా కలకలం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో వైసీపీ నాయకులు ధన దాహనికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏటిఒడ్డుపర్త గ్రామంలో ప్రభుత్వ స్థలంలోని టేకు చెట్లను దొంగతనంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్థలంలోని చెట్లను రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తున్న నలుగురు వ్యక్తులను వాహనంతో సహా గ్రామస్తులు అడ్డగించారు. దొరికిన వాహనంలో ఎక్కించిన టేకు దుంగలు ప్రభుత్వ స్థలంలోనిది అని అక్రమార్కుల కళ్ళు దానిపై ఉందని స్థానిక ఎమ్మార్వో…

Read More
Dolapeta villagers face challenges as 15 cents of their 22-cent burial ground are illegally occupied, making funeral access nearly impossible.

ఎచ్చెర్లలో స్మశానానికి దారి లేక ప్రజల ఆవేదన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డోలపేట గ్రామంలో స్మశాన స్థలం కబ్జా చేయడంతో స్మశానానికి వెళ్లడానికి దారిలేదని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు స్మశాన స్థలం 22 సెంట్లు ఉండగా అందులో 15 సెంట్లు ఆక్ర‌మ‌ణ‌దారులు కబ్జా చేశారు. అయితే కేవలం ఏడు సెంట్లకు మాత్రమే పరిమితమైంది. గ్రామంలో ఎవ‌రైనా మృత్యువాడ ప‌డితే మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేసేందుకు కూడా అవ‌కాశం లేని ప‌రిస్థితి నెల‌కొంది. శ్మ‌శాన‌వాటిక‌కి వెళ్లేందుకు ర‌హ‌దారి సౌక‌ర్యంతో పాటు క‌నీస సౌక‌ర్యాలు…

Read More
Police in Srikakulam district seized 563 kg of ganja during a vehicle check. Three people and the vehicle have been taken into custody.

శ్రీకాకుళంలో 563 కేజీల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దాడిపల్లి గ్రామం వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆపకుండా బొలెరో వాహనం వెళ్లి పోవడంతో వెంబడించిన పోలీసులకు 563.920 కేజీల గంజాయి పట్టుబడిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇందులో ముగ్గురు వ్యక్తులతో పాటు సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే గంజాయి పై గట్టి నిఘా ఉంచామన్నారు. ఎవరైనా…

Read More
Srikakulam MLA Gondi Shankar emphasized the importance of sports for a bright future and highlighted the state government's new sports policy.

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ….

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నతంగా ఎదగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో 68వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ బాస్కెట్ బాల్ 2024-25 అండర్ 19 బాల బాలికల ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీ స్టోర్ట్స్‌ నూతన…

Read More
Minister Achannaidu urged farmers to embrace technology to increase profits, as efforts are underway to make agriculture sustainable in the region.

రైతుల లాభం కోసం సాంకేతికత వినియోగం అవసరం

వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆరుగాలం కష్టపడ్డ రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఉత్తర కోస్తాకు అనువైన లాభసాటి వ్యవసాయ విధానాలు అనే అంశంపై ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం, రాగోలు, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “కిసాన్ మేళా” ను రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో…

Read More
Despite court orders confirming ownership, Ragolu landowners face ongoing harassment and threats from encroachers, leading to a plea for official protection.

రాగోలు గ్రామ భూ వివాదంలో దౌర్జన్యాలకు గురైన యజమానులు

శ్రీ‌కాకుళం జిల్లా రాగోలు గ్రామీణం రాగోలు గ్రామం పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న 80 సెంట్ల స్థలం స్థలంకు 1982 సెప్టెంబర్ 4న లచ్చిరెడ్డి హరినాథ్ బాబా అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయకపోవడం వలన స్పెసిఫిక్ అగ్రిమెంట్ పర్ఫామెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ కింద ఓ ఎస్ నెంబర్ 76/85 కింద కేసును నమోదు చేయడం జరిగింది. శ్రీకాకుళం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి 1991 ఫిబ్రవరి 8న లచ్చిరెడ్డి హరినాథ్ బాబాకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఆ…

Read More
At the local Palakonda Government High School, Principal Suryanarayana educated students about the dangers of substance abuse, culminating in a rally against drug use.

ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాలపై అవగాహన

స్థానిక పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు మత్తు పదార్థాలు వాటి వల్ల కలిగే నష్టాలు గురించి విద్యార్థులకి ప్రధానోపాధ్యాయులు శ్రీమీసాల సూర్యనారాయణ వివరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రహదారి యాత్ర చేస్తూ మత్తు పదార్థ వ్యతిరేక నినాదాలు చెప్పారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More