రథసప్తమి వేడుకల్లో భక్తులకో ఆనందోత్సాహం
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల సందడితో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు స్వామివారి దర్శనం పుణ్యం పొందారు. దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ స్వయంగా వేడుకలను పర్యవేక్షించారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం విశేషం. ఆయన…
