BharatPe Pay: భారతదేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే, YES బ్యాంక్ భాగస్వామ్యంతో ‘Pay Later with BharatPe’ అనే కొత్త UPI క్రెడిట్ సేవలను ప్రారంభించింది. NPCI ఆధారితంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులకు తక్షణ రుణ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా కంపెనీ వెల్లడించింది.
ఈ సేవ ద్వారా వినియోగదారులు ఏ UPI QR కోడ్ స్కాన్ చేసినా, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ రీచార్జ్‌లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు వంటి వాటిని క్రెడిట్ లైన్ ఉపయోగించి చేయవచ్చు. పేపర్‌వర్క్ అవసరం లేకుండా, ఆలస్యం లేకుండా తక్షణంగా UPI క్రెడిట్ లభిస్తుందని భారత్‌పే తెలిపింది.
ALSO READ:Mohan Bhagwat Statement | భారత్ హిందూ దేశమే…మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
ఈ క్రెడిట్ సౌకర్యంలో గరిష్టంగా 45 రోజుల వరకు వడ్డీ లేకుండా చెల్లింపు అవకాశం ఉంటుంది. వినియోగదారులు నెలాఖరులో మొత్తం చెల్లించవచ్చు లేదా 3 నుంచి 12 నెలల వరకు EMIలుగా చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. చెల్లింపులు పూర్తయిన తర్వాత క్రెడిట్ లిమిట్ మళ్లీ రీఫ్రెష్ అవుతుంది.
భారత్‌పే UPI యాప్ ద్వారా లావాదేవీలు చేసిన వినియోగదారులకు జిలియన్ కాయిన్స్ రూపంలో రివార్డులు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ రివార్డులను బ్రాండెడ్ వోచర్లు కొనుగోలు చేయడానికి లేదా యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు వినియోగించుకోవచ్చు.
