ఏపీ–తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోయాయిన చలి ఉష్ణోగ్రతలు .వాతావరణ శాఖ అందించిన సమాచార ప్రకారం ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో(Bay of Bengal) అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ పరిణామంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.
ALSO READ:India-US Trade Deal Soon: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై త్వరలో శుభవార్త
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా “9.2 డిగ్రీలు”, మెదక్‌లో “9.8 డిగ్రీలు”, పటాన్‌చెరులో “10.2 డిగ్రీలు”, రాజేంద్రనగర్‌లో “12 డిగ్రీలు” నమోదు అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా కనిపించింది. కోహీర్‌లో “7.8 డిగ్రీలు”, నార్లాపూర్‌లో “9.5 డిగ్రీలు”నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. అరకులో “8 డిగ్రీలు”, పాడేరులో “10 డిగ్రీలు” నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది.
అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు చలికి ప్రత్యక్షంగా గురవుతున్నారు.
