ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన భారీ మద్యం స్కామ్(AP Liquor Scam) కేసులో సిట్ దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన మనీలాండరింగ్ నిపుణుడు అనిల్ చోఖ్రా(Anil Chokhra)ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తరఫున రూ.77.55 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా మళ్లించినట్లు చోఖ్రాపై ఆరోపణలు ఉన్నాయి. క్రిపటి ఎంటర్‌ప్రైజెస్, నైసనా మల్టీ వెంచర్స్, ఓల్విక్ మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్‌ప్రైజెస్ పేర్లతో నాలుగు ఫేక్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటిలోకి లిక్కర్ సొమ్ము జమ చేయించినట్లు దర్యాప్తులో తేలింది.
తరువాత ఈ మొత్తాన్ని మరో 32 ఖాతాలకు లేయరింగ్ చేసి నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.
ఇదే తరహా కేసుల్లో అనిల్ చోఖ్రా 2017 మరియు 2021లో ఈడీ చేతిలో అరెస్టై, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఈ స్కామ్(Liquor Scam)లో పాల్గొన్నట్లు సిట్ తెలిపింది. భారీ కమీషన్ తీసుకుని లావాదేవీలకు సహకరించినట్లు సమాచారం.
టెక్నాలజీ ఆధారంగా అతని కమ్యూనికేషన్లపై నిఘా పెట్టిన సిట్ అధికారులు, ఈ నెల 13న అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో చోఖ్రాను 49వ నిందితుడిగా చేర్చి, ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
also read:TTD Parakamani Case:పరకామణి కేసులో టీటీడీ అధికారుల విచారణ
