ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన హెచ్చరించిన వాతావరణ శాఖ.మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 17న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం(Andhra Pradesh weather) ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేసింది.
దీని ప్రభావంతో నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొంత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ALSO READ:Naidupeta bike accident:బైకులు ఢీకొని ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు!
ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాల కారణంగా మరిన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది.
