Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAMCA project | భారత్‌కు కొత్త మైలురాయి.. పుట్టపర్తిలో AMCA ఫైటర్ జెట్ ప్రాజెక్టు ప్రారంభం

AMCA project | భారత్‌కు కొత్త మైలురాయి.. పుట్టపర్తిలో AMCA ఫైటర్ జెట్ ప్రాజెక్టు ప్రారంభం

-

Chat on WhatsApp

AMCA project: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో భారీ రక్షణ రంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. పుట్టపర్తి సమీపంలో నిర్మించనున్న ‘అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 650 ఎకరాల్లో ఈ అత్యాధునిక రక్షణ తయారీ కేంద్రాన్ని నిర్మించనున్నారు.

దేశీయ సాంకేతికతతో ఐదో తరం యుద్ధ విమానాలను తయారు చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ Defence Research and Development Organisation(DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.

AMCA ప్రాజెక్టు కింద తయారయ్యే స్టీల్త్ ఫైటర్ జెట్‌లు భారత వైమానిక దళ భవిష్యత్ అవసరాలకు కీలకంగా మారనున్నాయి. రెండు ఇంజిన్లు కలిగిన ఈ యుద్ధ విమానాలు శత్రువుల రాడార్‌లకు చిక్కకుండా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అత్యాధునిక ఏవియానిక్స్, స్మార్ట్ వెపన్ సిస్టమ్స్, శత్రు క్షిపణులను తప్పించుకునే సాంకేతికత ఈ జెట్‌లలో అమర్చనున్నారు.

ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే ఐదో తరం యుద్ధ విమానాల సాంకేతికత అందుబాటులో ఉంది. పుట్టపర్తి AMCA ప్రాజెక్టు విజయవంతమైతే స్వదేశీ పరిజ్ఞానంతో అయిదో తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేసే దేశాల జాబితాలో భారత్ కూడా చేరనుంది. ఈ ప్రాజెక్టు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి పెద్ద బలంగా మారనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

central government lifts petrol and diesel purchase restrictions from july 1

Petrol and Diesel | ఇంధన వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై...

Petrol and Diesel: దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో అమల్లోకి తీసుకొచ్చిన తాత్కాలిక పరిమితులను పూర్తిగా తొలగిస్తూ జూలై 1 నుంచి...
- Advertisement -
Chat on WhatsApp