Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy invited as chief guest for Akhanda 2 pre-release event Chief Minister Revanth Reddy invited as chief guest for Akhanda 2 pre-release event

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న పెద్ద చిత్రం ‘అఖండ 2’ . డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం ఈ నెల 28న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.

ALSO READ:మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామేలు

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. ఈ వేడుకను భారీగా ఏర్పాటు చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కూడా ఈవెంట్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, అట్లీ దర్శకత్వంలో చేస్తున్న తన కొత్త సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా బన్నీ ఈవెంట్‌కు హాజరు కావడం సాధ్యం కాకపోవచ్చని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *