HomeENTERTAINMENTAamir Khan | ఏక్ దిన్ సినిమా చూసి ఎమోషనల్ అయిన ఆమిర్ ఖాన్

Aamir Khan | ఏక్ దిన్ సినిమా చూసి ఎమోషనల్ అయిన ఆమిర్ ఖాన్

-

Chat on WhatsApp

Aamir Khan: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ భావోద్వేగానికి లోనైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తనయుడు జునైద్ ఖాన్, నటి సాయి పల్లవి జంటగా నటించిన ‘ఏక్ దిన్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను చూసి ఆమిర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సాయి పల్లవిని ఆయన దేశంలోనే అత్యుత్తమ నటిగా ప్రశంసించారు.

సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు తనను తీవ్రంగా కదిలించాయని, కథలోని ఎమోషన్‌కు పూర్తిగా ఫిదా అయ్యానని ఆమిర్ ఖాన్ తెలిపారు. సినిమా కలెక్షన్ల కంటే కథకు ప్రాణం పోయడమే నిజమైన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు.

ముంబైలోని ఎస్ఎన్డీటీ కాలేజీలో జరిగిన ‘ఏక్ దిన్ కి మెహఫిల్’ మ్యూజికల్ ఈవెంట్‌లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రదర్శించగా ఆమిర్ ఖాన్ భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కన్నీళ్లు తుడుచుకుంటుండగా సాయి పల్లవి ఓదార్చిన దృశ్యం కూడా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సాయి పల్లవి కూడా ఈ అనుభవంపై స్పందిస్తూ, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో అందరి ముందు ఎమోషనల్ అవ్వడం ఆయన గొప్పతనమని చెప్పారు. తాను కూడా సినిమా చూస్తూ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయానని తెలిపారు.

ఈ చిత్రం బాలీవుడ్‌లో సాయి పల్లవి ఎంట్రీగా నిలుస్తోంది. సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మించారు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా తెలుగులో ‘ఒక రోజు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp