Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeCrime Newsరాంగ్ రూట్ లో ప్రయాణించిన బైకర్ ప్రాణాలు కోల్పోయాడు

రాంగ్ రూట్ లో ప్రయాణించిన బైకర్ ప్రాణాలు కోల్పోయాడు

-

Chat on WhatsApp

తొందరగా వెళ్లాలనే ఆత్రుతతో రాంగ్ రూట్ లో ప్రయాణించిన ఓ బైకర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఖైరతాబాద్ టాంక్ బండ్ పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ టాంక్ బండ్ పై సోమవారం ఉదయం బ్రహ్మయ్య అనే వ్యక్తి బైక్ పై రాంగ్ రూట్ లో వెళ్తుండగా, ఐమాక్స్ నుంచి కారులో వేగంగా దూసుకొచ్చిన విజయ్ కుమార్ టర్నింగ్ దగ్గర్లో ఎదురుగా వచ్చిన బైక్ ను గుర్తించాడు. బైక్ ను తప్పించాలని ప్రయత్నించినా కుదరలేదు.

కారు బలంగా బైక్ ను ఢీ కొట్టడంతో, బైక్ నడుపుతున్న బ్రహ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బ్రహ్మయ్యను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp