Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshభీమిలి అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా

భీమిలి అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా

-

Chat on WhatsApp

భీమిలి అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమందికి టోకెన్లు ఇస్తున్నారు, భోజనం నాణ్యత ఎలా ఉంది, ఏమైనా లోపాలున్నాయా వంటి వివరాలను నిర్వాహక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరితో పాటు కలిసి భోజనం చేశారు. భోజనం రుచి ఉందని, పరిసరాల పరిశుభ్రత కూడా బాగుందని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. భోజనం కోసం వచ్చిన వాళ్ళతో కొంత సేపు ముచ్చటించారు. అన్నా క్యాంటీన్ లో వడ్డిస్తున్న భోజనం పట్ల వారందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ లలో భోజనానికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదవాడికి రూ.5 కే కడుపు నిండా మంచి భోజనం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారందరూ ప్రశంసించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ap eapcet 2026 counselling schedule latest update and required documents

AP EAPCET 2026 కౌన్సెలింగ్ ఈనెల 15 నుంచే?.. ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం అందింది. AP EAPCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. దీనికి...
- Advertisement -
Chat on WhatsApp