జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి పర్యటనలో అస్వస్థకు గురైన గద్వాల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత భర్త తిరుపతయ్య ని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మరియు మల్లు రవి గారు కలిసి అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి కర్నూలుకి మెరుగైన చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది ఈరోజు సాయంత్రం వారి పర్యటన మరియు మంత్రిగారి పర్యటన కార్యక్రమం అనంతరం సంపత్ కుమార్ గారు తిరుపతయ్య గారిని కర్నూల్ లోని అమీలియా హాస్పిటల్ లో కలిసి వారి స్థితిగతులను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు డాక్టర్లతో మాట్లాడి తిరుపతయ్య కి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
వీరి వెంట అలంపూర్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు
తిరుపతయ్య గారికి ప్రథమ చికిత్స అందించిన మల్లు రవి
