Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeInterNationalడబ్ల్యూటీసీ ఫైనల్‌కి దూసుకొచ్చిన బంగ్లాదేశ్

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి దూసుకొచ్చిన బంగ్లాదేశ్

-

Chat on WhatsApp

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోకి దూసుకొచ్చి ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.

న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఫైనల్స్‌లో చోటు కోసం పోరాడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పత్తాలేకుండా పోయిన ఈ జాబితాలోకి ఇప్పుడు అనూహ్యంగా బంగ్లాదేశ్ దూసుకొచ్చి భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాతి స్థానంలో నిలిచింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి రెండుసార్లు చేరిన భారత్ ముచ్చటగా మూడోసారి కూడా అడుగుపెట్టనుంది. ప్రస్తుతం 68.52 శాతం పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు ఇంకా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన 85.09 శాతంతో ఈ సీజన్‌ను ముగించే అవకాశం కనిపిస్తోంది.

రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ప్రస్తుతం 62.50 శాతం పాయింట్లతో ఉంది. ఇది కూడా ఇండియా సహా ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఆసీస్ 76.32 శాతం పాయింట్లతో ఈ సైకిల్‌ను ముగించవచ్చు.

2021 డబ్ల్యూటీసీ విన్నర్ అయిన న్యూజిలాండ్ చేతిలో ప్రస్తుతం 50 శాతం పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా శ్రీలంక, ఇండియా, ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ లెక్కన కివీస్ 78.57తో ఈ సీజన్‌ను ముగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోకి దూసుకొచ్చిన బంగ్లాదేశ్‌ చేతిలో ప్రస్తుతం 45.83 శాతం పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా సౌతాఫ్రికా, ఇండియా, వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంది. పాకిస్థాన్‌తో దాని సొంతగడ్డపైనే ఓడించిన బంగ్లాదేశ్ మంచి ఊపుమీద ఉంది. ఈ నేపథ్యంలో అది 75 శాతం పాయింట్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ఫైనల్ రేసులోకి రావడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని బంగ్లాదేశ్ ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp