Sangeetha: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చకు దారితీసిన సీఎం విజయ్(CM Vijay) కుటుంబ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను అధికారికంగా ఉపసంహరించుకోవడంతో ఈ హైప్రొఫైల్ కేసు కొత్త మలుపు తిరిగింది. చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో దాఖలైన ఈ పిటిషన్‌ను కొనసాగించబోనని సంగీత కోర్టుకు తెలియజేసినట్లు సమాచారం. ఆమె అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, పిటిషన్ ఉపసంహరణను నమోదు చేసి కేసుకు సంబంధించిన విచారణను ముగిస్తూ ప్రొసీడింగ్స్‌ను డిస్పోజ్ చేసింది.
విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల అనేక ఊహాగానాలు, పుకార్లు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. విడాకుల వ్యవహారం రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీయగా, ఇప్పుడు పిటిషన్ ఉపసంహరణతో ఆ ప్రచారానికి తాత్కాలికంగా తెరపడినట్లు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలపై ఇరు వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశం కావడంతో మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కోర్టు ప్రక్రియ ముగియడంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.
ALSO READ: Google Maps సూపర్ అప్డేట్.. ఫుడ్ నుంచి టికెట్ల వరకు అన్నీ ఒక్కచోటే!








