WhatsApp Account: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో సోమవారం రాత్రి ఊహించని అంతరాయం ఏర్పడింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో వేలాది మంది వినియోగదారుల ఖాతాలు అకస్మాత్తుగా ‘Account in Review’ స్థితిలోకి వెళ్లడంతో మెసేజ్‌లు, కాల్స్, ఇతర ఫీచర్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తగా, పొరపాటున ప్రభావితమైన ఖాతాలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని వాట్సాప్ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో సమస్య ప్రారంభమైంది.
యాప్ తెరిచిన వెంటనే “మీ అకౌంట్ కార్యకలాపాలను పరిశీలిస్తున్నాం. సాధారణంగా 24 గంటల్లో సమీక్ష పూర్తవుతుంది” అనే సందేశం కనిపించడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. ఈ ఘటనపై సోషల్ మీడియా, ముఖ్యంగా X వేదికలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ అంశంపై స్పందించిన వాట్సాప్ ప్రతినిధి, సేవను దుర్వినియోగం చేసే ఖాతాలను గుర్తించేందుకు ఆటోమేటెడ్ వ్యవస్థలు పనిచేస్తాయని, అయితే కొన్ని సందర్భాల్లో నిజమైన వినియోగదారుల ఖాతాలు కూడా పొరపాటున రివ్యూకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు.
అలాంటి ఖాతాలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అయితే మొత్తం ఎన్ని ఖాతాలు ప్రభావితమయ్యాయో, ఇది సాంకేతిక లోపమా లేక ఆటోమేటెడ్ మోడరేషన్ ప్రక్రియలో భాగమా అనే విషయాలపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
ALSO READ: Mythri Movie Makers |’దొంగ నా కొడుకు’తో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త ప్రయోగం.. రాబరీ కామెడీకి శ్రీకారం








