Mythri Movie Makers: టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కొత్త నటీనటులు, యువ సాంకేతిక నిపుణులతో వినూత్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘దొంగ నా కొడుకు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా రాబరీ క్రైమ్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
చిత్రాన్ని ప్రకటిస్తూ “Beware… Donga Naa Koduku is here to steal a few laughs” అనే సరదా ట్యాగ్‌లైన్‌ను విడుదల చేసిన మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఈ చిత్రంలో మౌళి(Mouli) కథానాయకుడిగా నటిస్తుండగా, సుస్మిత శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. శ్రీను కంబాల కథతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాకుండా, #MouliRobsMythri హ్యాష్‌ట్యాగ్‌తో నిర్వహించిన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ యెర్నేని, చెర్రీ సహ నిర్మాతలుగా ఉన్నారు. సింజిత్ యర్రమిల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థింక్ మ్యూజిక్ ఆడియో హక్కులు, ప్రత్యాంగిర సినిమాస్ ఓవర్సీస్ హక్కులు దక్కించుకోగా, నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామిగా చేరింది. విభిన్నమైన కథ, వినోదభరితమైన కామెడీతో ‘దొంగ నా కొడుకు'(Donga Naa Koduku) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: Kishan Reddy | వికసిత భారత్‌కు ఈవీలే భవిష్యత్.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు








