Monday, August 3, 2026
Chat on WhatsApp
HomeNationalKarnataka Cabinet Expansion | డీకే శివకుమార్ కేబినెట్ విస్తరణ.. యువత, మైనారిటీలకు పెద్దపీట

Karnataka Cabinet Expansion | డీకే శివకుమార్ కేబినెట్ విస్తరణ.. యువత, మైనారిటీలకు పెద్దపీట

-

Chat on WhatsApp

Karnataka Cabinet Expansion: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. “మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ముహూర్తం ఖరారైంది.” సోమవారం సాయంత్రం 4 గంటలకు కొత్తగా 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తుది జాబితాను సిద్ధం చేయగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనికి ఆమోదం తెలిపారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) లోక్ భవన్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వాస్తవానికి జూలై 31న కేబినెట్ విస్తరణ జరుగుతుందని భావించినప్పటికీ, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల చర్చల కారణంగా వాయిదా పడింది.

ఈసారి కేబినెట్ విస్తరణలో యువత, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల కింద డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆ  సమయంలో సీఎంతో పాటు 13 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ కొనసాగుతోంది. తాజా విస్తరణతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి మంత్రివర్గంతో కొనసాగనుంది. మంత్రులుగా ప్రమాణం చేయనున్న 20 మందిలో పి.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాణి, బి. నాగేంద్ర, జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, బంగారప్ప, అజయ్ సింగ్, లక్ష్మణ్ సవది తదితరులు ఉన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Vande Bharat Sleeper Train | ఏపీకి మరో వందేభారత్ కానుక.. విశాఖ నుంచి బెంగళూరుకు...

Vande Bharat Sleeper Train: విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మార్చేందుకు తొలి వందేభారత్ స్లీపర్...
- Advertisement -
Chat on WhatsApp