Vande Bharat Sleeper Train: విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మార్చేందుకు తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు ఇప్పటికే అధికారిక ఆదేశాలు జారీ చేయగా, దక్షిణ కోస్తా రైల్వే అధికారులు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ రైలు సోమవారం మినహా వారంలో మిగతా అన్ని రోజులు నడిచే అవకాశం ఉంది. విశాఖపట్నం నుంచి రాత్రి 8:15 గంటలకు బయలుదేరే రైలు దువ్వాడ, కృష్ణా కెనాల్, నంద్యాల, ధర్మవరం మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. తిరిగి వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి ధర్మవరం, నంద్యాల, కృష్ణా కెనాల్, దువ్వాడ మీదుగా ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ప్రస్తుతం విశాఖ–బెంగళూరు మధ్య రైలు ప్రయాణానికి సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. కొత్త వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం దాదాపు 14 గంటలకు తగ్గనుంది. దీంతో ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు, రెండు ప్రధాన నగరాల మధ్య రవాణా మరింత సులభతరం కానుంది.
ALSO READ: PMFBY Kharif 2026 | రైతులకు గుడ్‌న్యూస్.. పంటల బీమా గడువు పొడిగింపు








