PM Modi: దేశాన్ని కుదిపేసిన పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు పార్లమెంట్ ఆమోదించిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక సందేశం విడుదల చేశారు. పేపర్ లీక్ గ్యాంగ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరిస్తూ, కొత్త చట్టంతో పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. పేపర్ లీక్ మాఫియాపై ఎలాంటి రాజీ ఉండదని, అక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే గ్యాంగ్స్‌ను ఉపేక్షించబోమని ఆయన పేర్కొన్నారు.
పేపర్ లీక్ ఘటనలపై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో మోడీ విడుదల చేసిన వీడియోల్లో ఇది మరో కీలక సందేశంగా నిలిచింది. కొత్త చట్టం ప్రకారం పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే నేర ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. అలాంటి కేసుల్లో కనీసం 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేందుకు చట్టంలో అవకాశం కల్పించారు. ఈ చట్టం అమల్లోకి రావడంతో దేశంలోని పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు పేపర్ లీక్ మాఫియాపై గట్టి నియంత్రణ సాధించగలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ: Peddi Sudarshan Reddy | ‘ఆప్త మిత్రుడిని కోల్పోయా’.. పెద్ది మరణంపై కేసీఆర్ ఆవేదన








