Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshNara Lokesh | పత్తికొండలో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శ్రీకారం 

Nara Lokesh | పత్తికొండలో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శ్రీకారం 

-

Chat on WhatsApp

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ రంగానికి మరింత బలం చేకూర్చే మరో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే ఈ ప్రాజెక్టు ద్వారా భారీ పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. రూ.5,750 కోట్ల వ్యయంతో పత్తికొండలో 800 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తికి దోహదపడనుంది. అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాయలసీమ ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రాజెక్టులో దేశంలోని ప్రముఖ సంస్థలు Tata Power మరియు Suzlon Energy భాగస్వాములుగా ఉండనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ #RayalaseemaRising, #ChooseSpeedChooseAP హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో స్పందించారు. మరికొద్ది సేపట్లో పత్తికొండలో కలుద్దాం” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించడం, పారిశ్రామికాభివృద్ధికి వేగం పెంచడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛ ఇంధన హబ్‌గా తీర్చిదిద్దే దిశలో మరో కీలక అడుగుగా నిలవనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CP Sajjanar Issues Public Advisory Amid Heavy Rains in Hyderabad

CP Sajjanar  | భారీ వర్షాలపై సజ్జనార్ హెచ్చరిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

CP Sajjanar: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ (CP), వి.సి. సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే...
- Advertisement -
Chat on WhatsApp