Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTLenin | అయ్యగారికి అదిరిపోయే బ్లాక్‌బస్టర్.. 100 కోట్ల క్లబ్ లో లెనిన్

Lenin | అయ్యగారికి అదిరిపోయే బ్లాక్‌బస్టర్.. 100 కోట్ల క్లబ్ లో లెనిన్

-

Chat on WhatsApp

ఆయ్యగారే NO.01 అనే పేరుకు ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి, కెరీర్ ప్రారంభం నుంచి ఓ భారీ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్‌కు ఎట్టకేలకు మాస్ బ్లాక్‌బస్టర్ దక్కింది. నాగార్జున నమ్మకంతో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ‘లెనిన్’ సినిమా అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. విడుదలైనప్పటి నుంచి మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, రెండో వారంలోనూ మంచి కలెక్షన్లను కొనసాగించింది. అఖిల్ తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించగా, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్, మాస్ ఎలిమెంట్స్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది.

ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాల్లో ఇదే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, ఆయన కెరీర్‌లో తొలి రూ.100 కోట్ల గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. మరోవైపు అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య ‘తండేల్’తో వంద కోట్ల క్లబ్‌లో చేరగా, ఇప్పుడు అఖిల్ కూడా ‘లెనిన్’తో ఆ జాబితాలోకి చేరడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ విజయం అఖిల్ కెరీర్‌కు కొత్త ఊపునివ్వడంతో పాటు, అక్కినేని అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Huge Tree Falls on Mini Van in Siricilla, One Injured Due to Heavy Rains

Siricilla | సిరిసిల్లలో తప్పిన పెను ప్రమాదం.. భారీ చెట్టు కూలి వ్యక్తికి గాయాలు

Siricilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్‌లో భారీ వృక్షం నేలకొరిగి ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బలహీనమైన భారీ వేపచెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ...
- Advertisement -
Chat on WhatsApp