మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ రాజకీయవేత్త జైపాల్ రెడ్డి సేవలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి( Komatireddy Venkat Reddy), శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. ఆయన 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ‘స్ఫూర్తి స్థల్’ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ప్రజా సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన అరుదైన నాయకుల్లో జైపాల్ రెడ్డి ఒకరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తన వాక్చాతుర్యం, పార్లమెంటరీ పరిజ్ఞానంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. జైపాల్ రెడ్డి ఆలోచనా విధానం, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని మంత్రులు పేర్కొన్నారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. జైపాల్ రెడ్డి ఆశయాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ALSO READ: Allu Arjun | “నచ్చకపోతే వదిలేయండి”.. ట్రోల్స్‌పై అల్లు అర్జున్ పవర్ఫుల్ కామెంట్స్








