Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeNationalMeta | మోడీ వీడియో తొలగించిన మెటా.. కేంద్రం సీరియస్! మెటా క్షమాపణలు

Meta | మోడీ వీడియో తొలగించిన మెటా.. కేంద్రం సీరియస్! మెటా క్షమాపణలు

-

Chat on WhatsApp

Meta: ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌లో కొంతసేపు కనిపించకుండా పోవడం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై స్పందించిన మెటా సంస్థ, సాంకేతిక లోపం కారణంగానే వీడియో తాత్కాలికంగా తొలగించబడిందని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్య తీసుకోలేదని, పొరపాటును గుర్తించిన వెంటనే వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరినట్లు సమాచారం. జూలై 23న ప్రధాని మోడీ విడుదల చేసిన వీడియోలో పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీడియో తాత్కాలికంగా ఫేస్‌బుక్‌ నుంచి కనిపించకుండా పోవడంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. తొలుత న్యాయపరమైన అభ్యర్థన కారణంగా వీడియోను నిలిపివేసినట్లు నోటీసు కనిపించినప్పటికీ, అనంతరం అది తొలగించబడింది. కొద్ది సేపటికే వీడియో మళ్లీ యథావిధిగా అందుబాటులోకి వచ్చింది.

ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మెటా ఇచ్చిన వివరణపై సంబంధిత అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారని సమాచారం. అవసరమైతే సంస్థ ప్రతినిధులను వివరణ కోసం పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీడియో తొలగించే ముందు దానిని లక్షలాది మంది వీక్షించినట్లు సమాచారం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Japan Earthquake

Japan Earthquake | జపాన్‌లో భూకంప బీభత్సం.. సునామీ హెచ్చరికలు జారీ

Japan Earthquake: జపాన్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం ఆందోళనకు గురిచేసింది. దక్షిణ ప్రాంతంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో మంగళవారం ఉదయం బలమైన భూకంపం నమోదైంది. జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప...
- Advertisement -
Chat on WhatsApp