Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeTelanganaHYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు ఫైర్.. కోర్టు ధిక్కరణపై తీవ్ర హెచ్చరిక

HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు ఫైర్.. కోర్టు ధిక్కరణపై తీవ్ర హెచ్చరిక

-

Chat on WhatsApp

మల్కాజ్‌గిరి పరిధిలోని లోతుకుంట భూముల వ్యవహారంలో హైడ్రా (HYDRAA) అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో కోర్టు ఉత్తర్వులను ఒకే పిటిషన్‌లో మూడుసార్లు ఉల్లంఘించడం అత్యంత తీవ్రమైన విషయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లకుండా, అదే భూమిలోకి మళ్లీ ప్రవేశించడం చట్టవిరుద్ధ చర్యగా అభిప్రాయపడింది.

ఇలాంటి వ్యవహారం న్యాయవ్యవస్థను ధిక్కరించినట్లేనని హెచ్చరించింది. ఈ సందర్భంగా గతంలో జారీ చేసిన ఆర్మీ రక్షణకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలులో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp