Janasena: పార్టీలో ఐక్యత, సమన్వయం ఎంతో అవసరమని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పేర్కొన్నారు. పొత్తులో భాగంగా రాజకీయ ప్రయాణం కొనసాగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఒకేసారి అన్ని పదవులు ఆశించడం సాధ్యం కాదని, పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
జనసేన కార్యకర్తలు, నాయకులు వ్యక్తిగత విభేదాలు, అనవసర చర్చలకు దూరంగా ఉండాలని కోరారు. చిన్న చిన్న సమస్యల కారణంగా ఒకరినొకరు దూరం చేసుకోవద్దని, అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే పోటీ భావన ఉండాలని, పార్టీ కోసం పనిచేసే సమయంలో అందరూ ఒకే కుటుంబంలా ఉండాలని చెప్పారు.
పార్టీలో గ్రూపులు ఉండాల్సింది కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పోటీ పడేటప్పుడేనని, ప్రస్తుతం అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం కూడా ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడమేనని పేర్కొన్నారు.“మనం పొత్తులో ఉన్నాం.. ఒకేసారి అన్ని పదవులు అడగలేం. పార్టీ ఇంకా ఎదగాల్సి ఉంది. అందరం కలిసి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి” అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తేనే పార్టీ మరింత బలపడుతుందని ఆయన అన్నారు.
Nadendla Manohar | పార్టీ ఎదుగుదలే లక్ష్యం.. పదవుల కోసం తొందర వద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్
-








