హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి(NIMS Hospital)లో చికిత్స పొందుతున్న బాలింతలను మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులను కలిసి బాధితుల చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బాలింతకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, బాలింతలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 13న జరిగిన సిజేరియన్ శస్త్రచికిత్సల అనంతరం ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడంతో వారిని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.








