RS Brothers: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్లో ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ RS బ్రదర్స్ కొత్త షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటుడు నాగచైతన్య(Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. నూతన షోరూమ్‌లో పురుషులు, మహిళలు, పిల్లల కోసం విభిన్న రకాల వస్త్రాలతో పాటు పండుగలు, వివాహ వేడుకలకు అనువైన ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. బోడుప్పల్‌తో పాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో మెరుగైన షాపింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ షోరూమ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తుంది.








