Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAnna Lezhneva | భర్త కోసం భక్తి మార్గం.. శ్రీవారిపై భక్తిని చాటిన పవన్ కళ్యాణ్...

Anna Lezhneva | భర్త కోసం భక్తి మార్గం.. శ్రీవారిపై భక్తిని చాటిన పవన్ కళ్యాణ్ సతీమణి

-

Chat on WhatsApp

Tirumala: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా(Anna Lezhneva) అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు కాలినడకన బయలుదేరడం భక్తుల దృష్టిని ఆకర్షించింది. గతంలో తన కుమారుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్న ఆమె, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై ఆయన ఆరోగ్యంగా కోలుకుంటున్న నేపథ్యంలో మరోసారి శ్రీవారి దర్శనానికి నడక మార్గాన్ని ఎంచుకున్నారు.

సనాతన ధర్మంపై విశ్వాసానికి మరో నిదర్శనం

విదేశీ మూలాలు కలిగినప్పటికీ భారతీయ సంప్రదాయాలు, సనాతన ధర్మంపై ఆమె చూపుతున్న గౌరవం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. భక్తి, విశ్వాసంతో అలిపిరి మెట్ల మార్గంలో యాత్ర కొనసాగిస్తూ శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. తరచూ తిరుమల శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్ కుటుంబం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అన్నా లెజ్నేవా ఈ పాదయాత్ర కూడా కుటుంబం శ్రీవారిపై ఉన్న విశ్వాసానికి మరో నిదర్శనంగా నిలిచింది. ఆమె యాత్ర విజయవంతంగా పూర్తై, శ్రీవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని అభిమానులు, భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Vikram-1 private orbital rocket launch from Sriharikota space centre

Pawan Kalyan | భారత ప్రతిభకు విక్రమ్-1 నిదర్శనం.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan: శ్రీహరికోట నుంచి జరిగిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో కీలక ఘట్టంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా...
- Advertisement -
Chat on WhatsApp