Friday, July 17, 2026
Chat on WhatsApp
HomeNationalGujarat | ATS ఆపరేషన్ సక్సెస్.. జైషే-ఎ-మహమ్మద్ లింకులపై ఐదుగురు అరెస్ట్

Gujarat | ATS ఆపరేషన్ సక్సెస్.. జైషే-ఎ-మహమ్మద్ లింకులపై ఐదుగురు అరెస్ట్

-

Chat on WhatsApp

దేశ భద్రతకు ముప్పుగా మారేలా ఉగ్రవాదులు రచించిన కుట్రను గుజరాత్(Gujarat) యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ATS) అడ్డుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఎ-మహమ్మద్‌ (JeM)తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్‌ బృందాలు పలు జిల్లాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి.

ఈ సందర్భంగా బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడియవాల్ అలియాస్ మహమ్మద్ ఖాదియాసన్, మహమ్మద్ షఫీ ముఖీ అలియాస్ షఫీ చాపీ, మహమ్మద్ హసన్ కరాడియా అలియాస్ హసన్ హైదర్‌పురి, మహమ్మద్ అయూబ్ సునసారా అలియాస్ మహమ్మద్ ఖలీ పేర్లతో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తులు నిషేధిత సంస్థతో ఎలాంటి సంబంధాలు కొనసాగించారు, వారి లక్ష్యాలు ఏమిటనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెట్‌వర్క్‌ వెనుక ఉన్న వ్యక్తులు, ఇతర అనుబంధాలపై కూడా భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి. దేశంలో ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునేందుకు భద్రతా సంస్థలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Telangana Minister Seethakka

Minister Seethakka | నిరుద్యోగులకు బిగ్ అప్డేట్.. మరో 50 వేల ఉద్యోగాలకు త్వరలో...

Minister Seethakka: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ పనితీరుపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన "నీళ్లు, నిధులు,...
- Advertisement -
Chat on WhatsApp